సీనియర్ నటులు జీవీ నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ కీలక పాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక చిత్రం ఆలోచన. సురేందర్ చాచా దర్శకుడు. గుండబోయిన శ్రీనివాస్ నిర్మాత. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల జీవితాలే ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలిసింది. అలాగే, నా మంచుపల్లకి స్ఫూర్తితో ఈ సినిమా రూపొందించినట్లు చెప్పారు. నిజంగా పేరుకు తగ్గట్టే ఇది మంచి ఆలోచన. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అని చిరంజీవి అన్నారు. మనసుల్ని కదిలించే భావోద్వేగపూరితమైన సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈనెల 27న సినిమా విడుదల కానున్నది. ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు.















