Skip to main content

Namaste NRI

డామిట్ డేవిడ్ రాజుకి పెళ్లైపోయింది

మణిశంకర్‌ ఫేమ్‌ జి.వెంకటకృష్ణన్‌ (జీవీకే) దర్శకత్వంలో షార్ప్‌ మైండ్స్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన కుటుంబ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డామిట్‌ డేవిడ్‌ రాజుకి పెళ్లైపోయింది అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమమాలతో ప్రారంభమైంది. కిరణ్‌కుమార్‌ గుడిపల్లి. కె.రామచంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నేను చేస్తున్న మూడో చిత్రమిది. కుటుంబ బంధాలకు వినోదాన్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. డేవిడ్‌ రాజు, పెళ్లి హంగామా ఏమిటన్నది కబుపుబ్బా నవ్విస్తుంది. పాటల రికార్డింగ్‌ ప్రారంభించాం. త్వరలో నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం అని అన్నారు. ప్రముఖ హీరోయిన్‌ అతిథి పాత్రలో నటించనుందని, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : జె.ప్రభాకర్‌ రెడ్డి, సంగీతం : ఎమ్‌.ఎల్‌.రాజా.

Social Share Spread Message

Latest News