Skip to main content

Namaste NRI

న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఐదు నుంచి 11 ఏండ్ల చిన్నారులకు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచంలో వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశంలో ఐదు నుంచి 11 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వయస్సు వారికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి హెల్త్‌ రెగ్యులేటర్‌ అయిన మెడ్‌సేఫ్‌ ప్రాథమికంగా అనుమతించింది. పీడియాట్రిక్‌ ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు పంపిణీ చేస్తామని వెల్లడిరచింది. 21 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇస్తామని చెప్పింది. ఇక మంత్రివర్గం అనుమతిస్తే చిన్నారులకు వచ్చే ఏడాది జనవరి చివరినాటికి చిన్నారులకు వ్యాక్సినేసన్‌ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News