Skip to main content

Namaste NRI

చైనా లో భారత రాయబారిగా ప్రదీప్ రావత్

చైనాలో భారత కొత్త రాయబారిగా సీనియర్‌ దౌత్తవేత్త ప్రదీప్‌కుమార్‌ రావత్‌ను నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం చైనా రాయబారిగా ఉన్న విక్రమ్‌ మిస్రీ నుంచి ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) 1990 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌ను చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. చైనా దౌత్యవేత్తలతో చర్చలు జరిపేటప్పుడు  చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారనే పేరు ఆయనకు ఉంది.  కాగా ప్రదీప్‌ రావత్‌ గతంలో హాంకాంగ్‌, బీజింగ్‌లలో దౌత్యాధికారిగా కూడా పని చేశారు.

Social Share Spread Message

Latest News