Namaste NRI

వైట్ హౌస్ లో మరోసారి కరోనా కలకలం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ పాలన యంత్రాంగంలో ఓ ఉద్యోగికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి మూడు రోజుల క్రితం బైడెన్‌తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్‌ సాకీ తెలిపారు. వైట్‌హౌస్‌లోని ఓ మధ్య స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరు. కానీ మూడు రోజుల క్రితం డిసెంబరు 17న అధ్యక్షుడు బైడెన్‌ దక్షిణ కరోలినా నుంచి పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్‌ వద్ద 30 నిమిషాలు ఉన్నారు అని శ్వేతసౌధం ప్రకటించింది.

                సదరు ఉద్యోగికి కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే అప్రమత్తమైన వైద్యులు అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌ టెస్టులు చేశారు. యాంటీజెస్‌, ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రెండిరటిలోనూ ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ ఆ ప్రకటనలో వెల్లడిరచింది. ఈ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.   అధ్యక్షుడికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events