Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం

న్యూ ఇయర్‌ వేడుక జరుగుతున్నది. అంతా మంచి జోష్‌లో ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నారు. చుట్టుపక్కల పటాకులు పేలుతున్నాయి. కానీ అక్కడ మాత్రం తుపాకులు మోగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిసిసిపీలో దుండగులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిసిసిపీ గల్ఫ్‌ పోర్ట్‌లో నూతన సంవత్సర వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఒక్కసారి పౌరులపై కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News