Skip to main content

Namaste NRI

జై భీమ్ కు మరో అరుదైన గౌరవం

తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన జై భీమ్‌ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారంగా పిలిచే అకాడమీ  అవార్డు (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ లో సీన్‌ ఎట్‌ ది అకాడమీ పేరుతో  ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని అప్‌లోడ్‌ చేశాడు. అకాడమీ యూట్యూబ్‌ వేదికగా ఒక తమిళ సినిమా వీడియోను ఉంచడం ఇదే తొలిసారి. జిస్టస్‌ చంద్రు న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదించిన ఓ కేసును ఆధారంగా జై భీమ్‌ చిత్రాన్ని రూపొందించారు.  గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాదు విమర్శకులనూ మెప్పించింది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు.  దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News