Namaste NRI

యూఏఈ నుంచి భారత్ కు వచ్చే వారికి బంపర్ ఆఫర్!

యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే వారికి షార్జాకు చెందిన లో కాస్ట్‌ క్యారియర్‌ ఎయిర్‌ అరేబియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 250 దిర్హమ్‌ (రూ.5,087)తో ఇండియాకు వచ్చే అవకాశం కల్పించింది. యూఏఈ నుంచి భారత్‌లోని 13 నగరాలకు ఈ ప్రత్యేక వన్‌వే సర్వీసులను నడిపిస్తామని ఎయిర్‌ అరేబియా ప్రకటించింది. ఈ జాబితాలో నాగ్‌పూర్‌, కోయంబత్తూర్‌, చెన్నై, త్రివేండ్రం, కొచ్చి, కాలికట్‌, గోవా, అహ్మదాబాద్‌, బెంగళూరు, జైపూర్‌, హైదరాబాద్‌, ముంబై, న్యూఢల్లీి ఉన్నాయి. యూఏఈ నుంచి ఈ గమ్యస్థానాలకు  విమాన చార్జీల ప్రారంభ ధర కేవలం రూ.5 వేలు మాత్రమే అని ప్రకటించింది.

                        విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటన అనంతరం విమాన చార్జీలు అమాంతం తగ్గిపోయినట్లు దుబాయ్‌లోని ట్రావెల్‌ ఏజెంట్లు వాపోయారు.

Social Share Spread Message

Latest News