కువైత్ ప్రభుత్వం ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తనిఖీలు నిర్వహిస్తూ జనవరి నెలలో 1,764 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. బహిష్కరణకు గురైన వారిలో 1,058 మంది పురుషులు, 706 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ వివిధ చట్టాలను ఉల్లంఘించడంతో ఖైదు చేయబడిన వారు అని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణలు అమలు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.














