Namaste NRI

ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన ప్రవాసులు

కువైత్‌ ప్రభుత్వం ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతోంది. తనిఖీలు నిర్వహిస్తూ జనవరి నెలలో 1,764 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. బహిష్కరణకు గురైన వారిలో 1,058 మంది పురుషులు, 706 మంది మహిళలు ఉన్నారు.  వీరందరూ వివిధ చట్టాలను ఉల్లంఘించడంతో ఖైదు చేయబడిన వారు అని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణలు అమలు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events