భారతీయ మహిళకు జాక్‌పాట్ తగిలింది. 22 మిలియన్ దిర్హమ్స్ (రూ.44.75 కోట్లు) గెలుచుకుంది. అబుదాబిలో నివాసముండే లీనా జలాల్ అనే భారతీయరాలు బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్ కొట్టింది. రాత్రికి రాత్రే లీనా ఖాతాలోకి రూ.44.75 కోట్లు వచ్చి పడ్డాయి. కేరళ రాష్ట్రం త్రిచూర్‌కు చెందిన లీనా జలాల్ మరో 10 మంది స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన టికెట్ నం.144387 వారికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. లీనా గెలిచిన భారీ నగదును వీరందరూ సమానంగా పంచుకోనున్నారు. భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల లీనా ఆనందం వ్యక్తం చేసింది. బిగ్ టికెట్ నిర్వాహకులకు లీనా కృతజ్ఞతలు తెలిపింది. అబుదాబిలో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్‌గా విధులు నిర్వహిస్తోంది.














