Namaste NRI

భారతీయులు అప్రమత్తంగా ఉండాలి…కీలక సూచనలు చేసిన హైకమిషన్

కెనడాలో నిరసనల హోరు కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో కెనడా, అమెరికా దేశాల మధ్య ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో  ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయులను ఉద్దేశించి అక్కడి భారత హైకమిషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక మీడియా ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు కూడా తప్పనిసరిగా పాటించాలని కోరింది. అందోళనలు, నిరసనలు జరిగే ప్రాంతాల వైపు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. అత్యవసర సహాయం కోసం (+6)6137443751 నంబవర్‌కు ఫోన్‌ చేయాలని పేర్కొంది. హైకమిషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్సులేట్‌ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లలో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా కూడా సహాయం కోరొచ్చని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events