అమెరికాలో తయారీ రంగం పుంజుకోవడం మొదలైందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన విద్యుత్తు వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని అమెరికాలో ప్రారంభించనుంది. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ విద్యుత్తు కార్ల వినియోగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ట్రైటియం సంస్థ ఏర్పాటు చేసే ఈ కొత్త ప్లాంట్ ఏటా 30 వేల విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఛార్జర్లను తయారు చేస్తుందన్నారు. ఇది స్థానికంగా 500 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. ఈ ఏడాది తృతీయ త్రైమాసికంలో ఇది ఉత్పత్తిని ప్రారంభించనుందన్నారు. ఈ ఛార్జర్లలో పూర్తిగా అమోరికా విడిభాగాలనే, ఇనుము, స్టీల్‌నే వినియోగిస్తారని తెలిపారు.














