Skip to main content

Namaste NRI

కువైత్ మరో కీలక నిర్ణయం..

కువైత్‌ అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్ల పైబడి, హైస్కూల్‌ సర్టిఫికేషన్‌ కలిగిన ప్రవాసులు తప్పనిసరిగా వర్క్‌ పర్మిట్లను రెన్యువల్‌ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి తాత్కాలిక పొడిగింపులు ఉండబోమని స్పష్టం చేసింది. ఇటీవల అమలులోకి వచ్చిన 250 కువైటీ దినార్ల(రూ.61 వేలు) రెన్యువల్‌ రుసుము, 503 దినార్ల (రూ.1.23 లక్షలు) హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫీజులు చెల్లించి వర్క్‌ పర్మిట్లను పునరుద్ధరించుకోవాలని సూచించింది. తాజా గణాంకాల ప్రకారం 60 ఏళ్లు దాటిన, యూనివర్సిటీ డిగ్రీలేని 62,948 మంది ప్రవాసులు కువైత్‌ ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News