Namaste NRI

ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ… 30 రోజుల పాటు

రష్యా` ఉక్రెయిన్‌ మధ్య టెన్షన్‌ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమెర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ పరిధిలోని డోనెస్క్‌, లుహాస్క్‌ సహా అన్ని టెర్రిటరీలకు వర్తిస్తుందని ఉక్రెయిన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యాతో ఉద్రిక్తలు ముదురుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకున్న 30 రోజుల ఎమెర్జెన్సీ నిర్ణయం. వీలైతే మరో 30 రోజులకు పెరగొచ్చని కూడా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని అన్ని ఎంబసీలను, అంతర్జాతీయ కార్యాలయాలను మూసివేశారు. ఇక విమానాలు కూడా ఒకటొకటిగా రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో ఉన్న తమ దేశస్తులను వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్‌ ఇప్పటికే కోరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events