Namaste NRI

కీవ్‌ టవర్‌పై రష్యా బాంబు దాడులు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలోని ఓ టీవీ టవర్‌పై రష్యా బాంబు దాడులు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. రష్యా పౌరులు, కొన్ని ప్రభుత్వ సంస్థలపై సమాచార దాడులను అరికట్టడానికే ఈ దాడులు అని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌ భద్రతా దళాల హెడ్‌క్వార్టర్లపై దాడులు చేస్తామని రష్యా కొన్ని గంటల ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీవీ టవర్‌పై దాడులు చేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తొందరగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఉక్రెయిన్‌ అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

                        ఉక్రెయిన్‌కు చెందిన పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు రష్యా పౌరులపై సైబర్‌ దాడులకు దిగుతూ సమాచారాన్ని చోరీ చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా రాజధాని కీవ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ సైకలాజికల్‌ ఆపరేషన్స్‌పై దాడికి పాల్పడినట్లు రష్యా పేర్కొందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Social Share Spread Message

Latest News