ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ ప్రసంగానికి ఫిదా అయిన సభ్యులు పశ్చిమ దేశాల్లోని పార్లమెంట్లో నిలబడి ప్రశంసించారు. మాతో ఉన్నారో లేదో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని పశ్చిమ దేశాలకు విన్నవించారు. రష్యాపై పోరాటాన్ని యూరోపియన్ ఆదర్శాలను రక్షించే పోరాటంగా అభివర్ణించారు. దాని కోసం ఉక్రెయన్లు గత రెండు దశాబ్దాలలో రెండు రెవెల్యూషన్స్ చేపట్టారని గుర్తు చేశారు. ఉక్రెయిన్ను విడిచిపెట్టడం లేదని నిరూపించుకోవాలని సూచించారు. యూరోపియన్లు ఉక్రెయిన్‌తో ఉన్నారని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఫాస్ట్ ట్రాక్ ఈయూ సభ్యత్వాన్ని అభ్యర్థించిన మరుసటి రోజు జెలెన్ స్కీ ఈ వ్యాఖలు చేశారు. తాము అడవుల్లో, పొలాల్లో వీధుల్లో పోరాడుతామన్నారు. నోఫ్లై జోన్ ప్రకటించాలని జెలెన్ స్కీ సూచించాడు. దీంతో ఎంతో మంది ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారని విన్నంచుకున్నాడు. పుతిన్‌తో నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. దీని కోసం ముందు రష్యా యుద్ధం ఆపాలని కోరాడు.














