Skip to main content

Namaste NRI

శ్రీలంకకు భారీ సాయం అందించిన భారత్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు  భారత్‌ తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. రాజపక్సే ప్రభుత్వం భారత్‌ను సాయం కోరిన నేపథ్యంలో  40 వేల టన్నుల ధాన్యాన్ని, డీజిల్‌ను శ్రీలంకకు ఇండియా సరఫరా చేసింది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ  శ్రీలంకకు చేరుకుంది. దీంతో శ్రీలంక వ్యాప్తంగా డీజిల్‌ను సరఫరా చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ ఆరు వేల టన్నుల డీజిల్‌ను అందించనున్నట్టు  ఓ ప్రకటనలో  పేర్కొంది. 

Social Share Spread Message

Latest News