Skip to main content

Namaste NRI

తమ దేశంలోకి వారిని అనుమతించేది లేదు

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌,  న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లపై రష్యా నిషేధం విధించింది. తమ దేశంలోకి వారిని అనుమతించలేది లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ప్రధానులే కాదు ఆ రెండు దేశాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు కూడా తమ దేశంలోకి ప్రవేశించడానికి వీళ్లేదని ప్రకటించింది.   ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందిన 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. త్వరలో ఆస్ట్రేలియన్‌ మిలిటరీ, వ్యాపారవేత్తలు, నిపుణులు, రష్యాకు వ్యతిరేకంగా ఉండే జర్నలిస్టులను కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని వెల్లడిరచింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఆంక్షలు విధించాయి. దీంతో ప్రతి చర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

Social Share Spread Message

Latest News