వెంకట్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఈవిల్ లైఫ్. రాణి స్వాతి నాయికగా నటిస్తున్నది. బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. రామసత్యనారాయణ, ఆచంట గోపీనాద్ పాటలను విడుదల చేశారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు. హీరో, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ తానై సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రానికి కంప్లీట్ చేశారని, మారుతి తీసిన ప్రేమకథా చిత్రమ్ ఎలాగైతే సింపుల్‌గా హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవుతుందన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని తెరకెక్కించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. శ్యామల, అంజి, లతా, రాము తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బీఎస్ కుమార్, సంగీతం : దిలీప్. ఈ కార్యక్రమంలో కర్రి బాలాజీ, గౌతంరాజు, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.














