Namaste NRI

ఊటీలో ఘోస్ట్ ఆపరేషన్

నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌.  సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే దుబాయ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్‌ ఘట్టాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్‌ ఊటీలో ప్రారంభమైంది.  ఊటీలో షెడ్యూల్‌లో నాగార్జున, కథానాయిక సోనాల్‌ చౌహాన్‌పై ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో నాయకానాయికలిద్దరూ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపిస్తారు.  నాగార్జున పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ విషయాన్ని ప్రవీణ్‌ సత్తారు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి అంటూ సెట్లోని ఓ ఫోట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాలో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు, నబా మాస్టర్‌, ఛాయాగ్రహణం : జి.ముకేష్‌. నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌ రామ్‌ మోమన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events