సినిమాలో హీరోగా నటిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అన్పించుకున్నారు సోనూసూద్. తాజాగా ఆయన దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా యూఏఈ గోల్డెన్ వీసా అందించింది. ఈ దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్. ఇంకా నేను ఈ గోల్డెన్ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సదర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సోనూసూద్ పేర్కొన్నాడు.














