అమెరికాలో పని చేసేందుకు హెచ్`4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా హక్కు కల్పించే బిల్లును ఇద్దరు చట్ట సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులతో పాటు వేలాది విదేశీ జీవిత భాగస్వాములకు లబ్ధి చేకూరుతుంది. భర్త లేదా భార్యల వెంట అమెరికాకి వెళ్లే వారు వెంటనే హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాగే అమెరికా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న కార్మికులు, సిబ్బంది కొరతను ఇది తీరుస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోసం హెచ్`1బీ, హెచ్`2ఏ, హెచ్`2బీ, హెచ్`3 వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు హెచ్`4 వీసాలను జారీ చేస్తారు. కాగా, చాలా మంది హెచ్`4 వీసాదారులు తమ తమ రంగాల్లో నైపుణ్యం ఉండి, కుటుంబానికి అండగా ఉంటేవారే. అయితే వారు అమెరికాలో నేరుగా ఉద్యోగాలు చేసేందుకు వీలు లేదు.
ఈ నేపథ్యంలో ఈ అడ్డంకిని తొలగించేందుకు కాంగ్రెస్ మహిళా సభ్యులు కరోలిన్ బోర్డ్‌క్స్, మరియా ఎల్విరా సలాజర్, హెచ్`4 వర్క్ అథరైజేషన్ యాక్ట్‌ను ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్`4 బీ వీసా కలిగిన జీవిత భాగస్వాములు హెచ్`4 వీసా పొందిన తర్వాత అమెరికాలో ఉద్యోగం చేసే హక్కును ఆటోమేటిక్‌గా పొందేలా చట్టంలో సవరణ చేయాలని కోరారు. ఈ వీసాలు ఉన్న వారు అమెరికాలో ఉద్యోగం కోసం ఫార్మ్ ఐ`765 ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరాన్ని ఈ బిల్లు నివారిస్తుందని పేర్కొన్నారు. దేశంలో కార్మికుల కొరత వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోందని వలసదారులకి ఆటోమేటిక్‌గా ఆ హక్కు వస్తే ఇరుపక్షాలకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వెళ్తున్న దేశాల్లో చైనా (3,48,992) టాప్‌లో ఉంది. ఆ తరువాత 2,3285తో భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది.














