Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌లో  కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్‌ నగరం బ్రూక్లిన్‌ సబ్‌వే రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఇందులో ఐదుగురు తమ ప్రాణాలను కోల్పోయారు. వారిలో 8 మందికి బుల్లెట్ల గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకుంది. కాల్పులు జరుపడానికి ముందు నిందితుడు స్మోక్‌ పరికరంతో స్టేషన్‌లో పొగ కమ్ముకునేలా చేసి ఉంటాడిన పోలీసు అధికారి తెలిపారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను దవాఖానలకు తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడు నిర్మాణరంగ కార్మికుడి చొక్కా వేసుకుని, గ్యాస్‌ మాస్కు ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Social Share Spread Message

Latest News