ఉక్రెయిన్‌లో రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ఉక్రెయిన్ అన్న ఆలోచన రాకుండా చేసేలా పుతిన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌లో జరుగుతోంది నరమేధమే అని అన్నారు. అంతర్జాతీయంగా రష్యా వ్యవహారశైలి ఎలా ఉందన్న దానిపై లాయర్లు నిర్ణయిస్తారని, అక్కడ ఊచకోత జరుగుతున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం పాల్పడిన అకృత్యాలకు సంబంధించిన భయానక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.














