Skip to main content

Namaste NRI

ఎస్‌.ఎస్‌.డి చిత్రం  ప్రారంభం

ఇమ్మార్టెల్‌, అమ్మ రాజశేఖర్‌, అలీషా, షాలిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఎస్‌.ఎస్‌.డి. ముహూర్తపు సన్నివేశానికి  నటి దర్శకురాలు జీవిత, నటుడు రాజశేఖర్‌లు కెమెరా స్విచాన్‌ చేయగా, పసుర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల యం.డి. ప్రశాంత్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోని వారి మనస్తత్వాలు, వారి జీవన విధానం, వారి జీవితంలో ఉండే కష్టాలు వంటి వాస్తవ ఘటనల నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది అన్నారు. పుల్‌గా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది అన్నారు ఈడీ ప్రసాద్‌. డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కెమెరామేన్‌ గోవర్ధన్‌ మాట్లాడారు. కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కెమెరా: గోవర్ధన్‌, సంగీతం: ప్రమోద్‌ కుమార్‌ శర్మ, ఎడిటింగ్‌: ఆనంద్‌ పవన్‌, నిర్మాత: ఈడీ ప్రసాద్‌, కొరియోగ్రఫీ, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: కట్ల రాజేంద ప్రసాద్‌.

Social Share Spread Message

Latest News