Skip to main content

Namaste NRI

అందుకు తామే కారణం… ఉక్రెయిన్‌

రష్యా యుద్ధ నౌక మాస్క్‌వా మునిగిపోయింది. తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ పై రష్యా మరింతగా విరుచుకుపడుతోంది. అందుకోసం సముద్ర మార్గం ద్వారా భారీ ఎత్తున అయుధ వ్యవస్థలను తరలిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలతో ప్రయాణిస్తున్న రస్యా నౌక ఒకటి తీవ్రస్థాయిలో దెబ్బతింది. అందుకు తామే కారణమని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఆ రష్యా యుద్ధనౌకపై తమ బలగాలు విస్సైల్‌ను ప్రయోగించాయని పేర్కొంది. రష్యాకు చెందిన మాస్క్వో క్రూజ్‌ నౌక ఉక్రెయిన్‌ తీరానికి చేరుకోగానే, తమ దళాలు క్షిపణితో దాడి చేశాయని ఒడెస్సా గవర్నర్‌ తెలిపారు. అయితే రష్యా ఈ ప్రకటనను ఖండిరచింది. యుద్ధనౌకలో జరిగిన పేలుడు కారణంగానే నష్టం వాటిల్లిందని వెల్లడిచిది. నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, వారిని సురక్షితంగా వెలుపలికి తరలించినట్టు రష్యా అధికారులు తెలిపారు. మాస్‌వా నౌకను నెప్ట్యూన్‌ మిస్సైల్‌తో పేల్చివేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్క్‌వా యుద్ద నౌక ఘటనకు సంబంధించిన అమెరికా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Social Share Spread Message

Latest News