Skip to main content

Namaste NRI

50 రోజులు అంటే.. అది మన ఘనతే

 ఉక్రెయిన్‌ దేశ ప్రజలు ధైర్యంతో ఉన్నారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ  అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన జాతిని  ఉద్దేశించి మాట్లాడారు. 50 రోజుల యుద్ధాన్ని నిలదొక్కుకున్నామని, రష్యా దాడికి 50 రోజులు నిండిరదన్నారు. ఈ 50 రోజుల్లో ప్రపంచ దేశాధినేతలు భిన్నరకాలుగా స్పందించారన్నారు. అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. కొందరు రాజకీయవేత్తలు తమ చేతుల్లో అధికారం లేనట్లు వ్యవహరించారని అన్నారు. మేటి రాజకీయవేత్తల కన్నా రాజకీయాల్లో లేని వారు ఈ 50 రోజుల్లో ఎంతో చేశారని గుర్తు చేశారు. ఉక్రెయన్‌ దళాలను ప్రశంసిస్తూ రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవాల్సిందే అన్నారు. 50 రోజులు మనం పోరాడం అంటే అది మన ఘనతే అన్నారు. ఇది లక్షల సంఖ్యలో ఉన్న ఉక్రెయిన్ల విజయం అన్నారు.

Social Share Spread Message

Latest News