Skip to main content

Namaste NRI

మాటరాని మౌనమిది చిత్రం గ్లింప్స్‌ విడుదల

రుద్ర పిక్చర్స్‌ మరియు పిసిర్‌ గ్రూప్‌ సమర్పణలో శుక్ర దర్శకుడు పూర్వాజ్‌ చేస్తున్న కొత్త సినిమా మాటరాని మౌనమిది. ఈ చిత్రంలో మహేష్‌ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్‌ స్టోరీ, థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న మాటరాని మౌనమిది సినిమా గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.  ఈ గ్లింప్స్‌ ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. నువ్వు మాట్లాడేదాక మట్టి నీ కింద ఉంటుంది. మాట్లాడటం ఆగిన తర్వాత ఆ మట్టినీ పైన ఉంటుంది అనే డైలాగ్‌తో పాటు హీరో హీరోయన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. గ్లింప్స్‌ చివర్లో వచ్చిన షాట్స్‌ సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను రిలీవ్‌ చేస్తున్నాయి. అషీర్‌ లుక్‌ సంగీతం మరియు శివరామ్‌ చరణ్‌ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.

Social Share Spread Message

Latest News