Namaste NRI

ఇమ్రాన్‌ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌  పార్టీలో తలెత్తిన తిరుగుబాటు కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రధాని సర్దార్‌ అబ్దుల్‌ ఖయ్యుం నియాజీ తన పదవికి రాజీనామా చేశారు. ఇమ్రాన్‌ ఏరి కోరి నియమించిన నియాజిపై సొంత పార్టీకి చెందిన 25 మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన వైదొలగక తప్పలేదు. పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడు సర్దార్‌ తన్వీర్‌ ఇలియాస్‌కు తిరుగుబాటు సభ్యులంతా మద్దతు పలుకుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ సభ విశ్వాసం కోల్పోయి పదవీచ్యుతుడైన వారం రోజుల్లోపే మనో పీటీఐ నేత అవిశ్వాసం దెబ్బకు పదవిని వదులుకోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events