సురేష్ సపవత్, సత్నా టైటస్ జంటగా నటిస్తున్న హు ఆర్ యు చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ ఇచ్చారు. లలిత కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సప్పెన్స్ క్రైమ్ జోనర్‌లో తెరకిక్కించబోతున్నాం. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి అన్నారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రియా నాయుడు మంచి కథనందించారు. మంచి బృందం కుదిరింది. నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామని తెలిపారు. వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి కథ: ప్రియా నాయుడు, నిర్మాణ సంస్థ: శివప్రియ ప్రొడక్షన్, కెమెరా: సురేష్ గొంట్ల, ఆర్ట్: వెంకటేష్ గుల్ల, సంభాషణలు: శ్రీనివాస్ తేజ, దర్శకత్వం: వైకుంఠ్ బోణు.














