Skip to main content

Namaste NRI

రష్యా మరో సంచలన నిర్ణయం

ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.  యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు రష్యా షాక్‌ ఇచ్చింది. రష్యాలోకి బోరిస్‌ జాన్సన్‌ ఎంటర్‌ కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నది. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రాస్‌ మాట్లాడుతూ బ్రిటన్‌ మాజీ ప్రధాని థెరిసా మే, స్కాట్‌లాండ్‌ మినిస్టర్‌ నికోలా స్టర్జియన్‌తో పాటు మరో 13 మంది బ్రిటీష్‌ ప్రభుత్వాధికారులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా అధికారులపై బ్రిటన్‌ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రష్యా కూడా ఆకస్మిక చర్యలకు పూనుకున్నది. తమ దేశంలోకి ఎంటర్‌ కాకుండా ఉండే నిషేధిత సభ్యుల విస్తృత జాబితాను త్వరలో ప్రకటించనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా వ్యతిరేకిస్తోంది.

Social Share Spread Message

Latest News