Skip to main content

Namaste NRI

షారుఖ్‌ ఖాన్‌ డంకీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో రూపొందుతున్న  చిత్రానికి డంకీ అనే టైటిల్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబరు 22న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు షారుక్‌. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. చట్టవిరుద్ధంగా పాస్‌పోర్టులు సంపాదించి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నించే విద్యార్థుల నేపథ్యంలో డంకీ సినిమా కథనం ఉంటుందన్నది బీ టాన్‌ టాక్‌. ఈ చిత్రానికి స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  షారుఖ్‌ఖాన్‌ సతీమణి గౌరీఖాన్‌ నిర్మించనుంది. దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. షారుఖ్‌ఖాన్‌తో సినిమా చేయాలన్న తన స్వప్నం ఇన్నాళ్లకు ఫలించిందని రాజ్‌కుమార్‌ హిరాణి సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News