Skip to main content

Namaste NRI

అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తాం.. లేదా విధ్వంసం

మారియపోల్‌ మా చేతుల్లోకి వచ్చేసింది. తక్షణం ఆయుధాలు వీడి లొంగిపోమ్మని మీ సైనికులను ఆదేశించండి, అర్థంపర్థం లేని ఎదురుదాడులను నిలిపివేయమని చెప్పండి. అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తాం. లేదా విధ్వంసం తప్పదని ఉక్రెయిన్‌కు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన నౌకాశ్రయ నగరం మారియపోల్‌ను దాదాపు స్వాధీనం చేసుకున్న రష్యాతో ఉక్రెయిన్‌ సైనికులు పోరాడుతూనే ఉన్నారు. దీనిపై అసహనంతో ఉన్న రష్యా రక్షణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.  ఇప్పుడే అసలైన రెండోదళ యుద్ధం ప్రారంభమైందని, చివరి వరకు తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన నేపథ్యంలో రష్యా స్పందిస్తూ ఈ ఆల్టిమేటం జారీ చేసింది.  తమ హెచ్చరికను ఉక్రెయిన్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఇప్పటివరకు సైనికులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని మండిపడిరది.  సైనికులైనా స్వచ్ఛందంగా లొంగిపోవాలని, అలాంటివారికి ప్రాణభిక్ష పెడతామని పిలుపునిచ్చారు.

Social Share Spread Message

Latest News