Skip to main content

Namaste NRI

అసాంజే అప్పగింతపై అమెరికాకు అనుకూలంగా తీర్పు

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ఆదేశాలను బ్రిటన్‌ కోర్టు జారీ చేసింది. ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ యుద్ధాలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిరంగంగా వెల్లడిరచి, ప్రచురించినందుకు విచారణను అమెరికాలో ఎదుర్కొనేందుకు వీలుగా ఆయనను ఆ దేశానికి అప్పగించాలని ఆదేశించింది. బ్రిటన్‌ ఇంటీరియల్‌ మినిస్టర్‌ ప్రీతి పటేల్‌ ఈ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆమె ఆయనను అమెరికాకు అప్పగించేందుకు ఆమోదం తెలిపినప్పటికీ, ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు అపీలు చేసే అవకాశం ఉంటుంది.

                 బ్రిటన్‌ సుప్రీంకోర్టుకు అపీలు చేసేందుకు అసాంజేకు గత నెలలో అనుమతి రాలేదు. అమెరికాకు ఆయనను అప్పగిస్తే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌ యుద్ధాలకు సంబంధించిన దాదాపు 5 లక్షల రహస్య సైనిక ఫైళ్ళను ప్రచురించినందుకు అసాంజేపై విచారణ జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.

Social Share Spread Message

Latest News