Namaste NRI

ఎఫ్‌3 సెకండ్‌ సింగిల్‌ వూ.. ఆ.. ఆహా రిలీజ్‌

విక్టరీ వెంకటేష్‌, మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఎఫ్‌`3. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌చౌహాన్‌ కథానాయికలు.  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.  వూ.. ఆ..ఆహా ఆహా అంటూ ఈ చిత్రంలోని రెండో గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్నందించారు. క్యాచీ ట్యూన్‌తో సాగిన ఈ పాటలో ముగ్గురు నాయికలు తమ అందచందాలతో కనువిందు చేశారు. టైటిల్‌కు తగినట్లుగానే ఈ సినిమా మూడిరతల వినోదంతో ప్రతి ఒక్కరి మోముల్లో నవ్వుల్ని విరబూయిస్తుంది. రాజేందప్రసాద్‌, సునీల్‌, పూజాహెగ్డే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌,  సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,  నిర్మాత: శిరీష్‌, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి. మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events