Skip to main content

Namaste NRI

ఇండియాతో పాటు ఇతర దేశాలకు.. క్లారిటీ ఇచ్చిన పెంటగాన్‌

రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ అభిప్రాయపడిరది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని అన్నారు. దీంట్లో తమకు ఎటువంటి ఉద్దేశం లేదని, కానీ ఆ అంశాన్ని ప్రోత్సహించమని పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కిర్బీ తెలిపారు. భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని, రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్‌ అని, ఆ విషయాన్ని గుర్తిస్తామని అన్నారు.

Social Share Spread Message

Latest News