Skip to main content

Namaste NRI

ఈ యుద్ధంలో విజేతలెవరూ ఉండరు.. శాంతికే మా మద్దతు

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంలో విజేతలెవరూ ఉండరు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్‌ షొల్జ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌ ఎల్లప్పుడు శాంతిపక్షమే వహిస్తుందని అన్నారు.  ఉక్రెయిన్‌, రష్యా వివాదాల పరిష్కారానికి శాంతి చర్చలే మార్గమని మొదటి నుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. యుద్ధం వల్ల ధరలు పెరిగిపోయి, ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఆర్థిక భారం మోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న పేద దేశాలు మరింత కుంగిపోతున్నారని వాపోయారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా రష్యా ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లఘించిందని షాల్జ్‌ విమర్శించారు. జీ`7 సదస్సుకు మోదీని ఆహ్వానించానని తెలిపారు.

Social Share Spread Message

Latest News