Skip to main content

Namaste NRI

రష్యాకు ధీటైన జవాబు ఇస్తాం

 మరియపోల్‌లో సాధారణ పౌరుల తరలింపుపై ఒప్పందానికి విరుద్దంగా రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. మరియపోల్‌లోని స్టీల్‌ ప్లాంట్‌ వద్ద యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు పెద్దఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతూ రష్యా కొత్త రకం ఉగ్రవాదాన్ని అనుసరిస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. ఈ మేరకు అటు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటు ఆ దేశ మంత్రి దిమిత్రో కులేబా విమర్శలు గుప్పించారు. రాజధాని కీవ్‌ శివారుల్లో చెరెకసీ, ద్నిప్రో, జపోరి రaరిరa యాలలో రష్యాల దాడులకు పాల్పడుతున్న యుద్ధ నేరాలన్నింటికీ చట్టపరంగా, రాజీకీయంగా, యుద్ధ క్షేత్రంలోనూ ధీటైన జవాబిస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News