Skip to main content

Namaste NRI

క్షమాపణ చెప్పిన రష్యా అధ్యక్షుడు.. ఎందుకో తెలుసా?

 రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్‌ నాజీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌లో యూదుల వారసత్వ లక్షణాలు ఉన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్షమాపణలు చెప్పినట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో పుతిన్‌ సారీ చెప్పారని ఇజ్రాయిల్‌ పీఎంవో కార్యాలయం తెలిపింది. కానీ రష్యా అధ్యక్ష కార్యాలయం మాత్రం ఇద్దరు నేతల మధ్య కేవలం కుశల సంభాషణలు జరిగినట్లు చెప్పింది. రష్యా రీలీజ్‌ చేసిన ప్రకటనలో క్షమాపణల అంశం లేదు. ఉక్రెయిన్‌పై దాడిని దిగిన రష్యా ఆ దేశాన్ని డీనాజీపై చేయనున్నట్లు తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగినట్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సెర్గీ లవ్రోవ్‌ కూడా కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు. మాజీ నాజీ నియంత హిట్టర్‌లో యూదుల రక్తం ఉన్నట్లు ఆరోపించారు.  నిజానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ యూద మతస్థుడు. కానీ ఉక్రెయిన్‌ నాజీ తరహా పాలన చేస్తున్నట్లు లవ్రోవ్‌ ఆరోపించారు.

Social Share Spread Message

Latest News