Skip to main content

Namaste NRI

వైట్‌హౌస్‌లో మరోసారి నల్లజాతీయురాలుకు ..ఉన్నత పదవి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి నల్లజాతీయులకు ఉన్నత పదవిని కట్టబెట్టారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తదుపరి ప్రెస్‌ సెక్రటరీగా కరీన్‌ జీన్‌ పియర్‌ను నియమించారు. దీంతో ఉన్నత స్థాయి పదవిని చేపట్టనున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు. 44 ఏండ్ల జీన్‌ పియర్‌ వైట్‌హౌస్‌లో బైడెన్‌ బృందంలో చేరడాని కి ముందు 2008, 2012లో మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామాకు, 2020లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ తరపున ప్రచారం నిర్వహించారు.  జీన్‌ పియర్‌ ఇప్పుడు జెన్‌కు డిప్యూటీగా ఉన్నారు. కాగా జీన్‌ పియర్‌ను ప్రెస్‌ సెక్రటరీగా నియమించడం గర్వంగా ఉందని బైడెన్‌ తెలిపారు. ఆమె అనుభవం, ప్రతిభ, సమగ్రత తమకు ఎంతగానో పనికొస్తాయన్నారు.  ప్రస్తుతం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా జెన్‌ పాకి పనిచేస్తున్నారు. ఈ నెల 13న ఆమె పదవీకాలం ముగియనుంది.

Social Share Spread Message

Latest News