Skip to main content

Namaste NRI

వారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలి : మంత్రి కేటీఆర్‌

ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం పథకాల గురించి, ఆస్ట్రేలియాలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల గురించి  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నందుకు గాను మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం ఇలాగే కష్టపడి పనిచేయాలని కాసర్లకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించడంతోపాటు వారి గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు.  ఎన్‌ఆర్‌ఐలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టి తీసుకురావాలని అన్నారు.

Social Share Spread Message

Latest News