అమెరికాలో పది లక్షల మంది కొవిడ్ మహ్మారికి బలయ్యారని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. కొవిడ్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వెనుకబడిన అంతర్జాతీయ నిబద్ధతను పునుద్ధరించాల్సి ఉందని ఆయన హెచ్చరించారు. మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు. కొవిడ్ కారణంగా కుటుంబాల్లో భోజన బల్లల వద్ద పది లక్షల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ఒక్క అమెరికాలోనే కరోనా కారణంగా 9,99,000 లక్షల మంది మృతి చెందారు. అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్, అమెరికన్ మెడికల్ అసోసియేషణ్ ప్రకారం కొవిడ్ మరణాలు పది లక్షలకు పైమాటే. అయితే బైడెన్ 10 లక్షల మంది మరణించారని తెలిపారు.














