Skip to main content

Namaste NRI

పాకిస్థాన్‌ కీలక ప్రకటన… అందుకు అనువైన వాతావరణం లేదు

పాకిస్థాన్‌ కీలక ప్రకటన చేసింది. భారత్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు చేద్దామంటే అందుకు అనువైన వాతావరణం లేదని పాక్‌ పేర్కొంది. పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆసీమ్‌ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌`పాక్‌ మధ్య వాణిజ్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పాక్‌ కేబినెట్‌ ఇటీవలే  కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఢల్లీిలో ప్రత్యేకంగా పాక్‌ తరపున ఓ వాణిజ్య మంత్రిని కూడా నియమిస్తామని ప్రకటించింది.  ఈ విషయంపై పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ ఈ విషయంలో తాము ఓ ఏకాభిప్రాయానికి వచ్చామనే వెల్లడిరచారు.  భారత్‌తో ఉన్న వివాదాలకు శాంతిపూర్వకంగా సమాధానం దొరకాలని భావిస్తున్నామని,  ఈ విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వపు విధానాలనే తామూ అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News