పార్వతీశం హీరోగా కొత్త సినిమా రూపొందనుంది. దేవరకొండలో విజయ్ ప్రేమకథ ఫేమ్ వెంకటరమణ ఎస్. ఈ సినిమాకి దర్శకుడు. జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య హీరోయిన్. వేదుల బాలకామేశ్వరి సమర్పణలో సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్‌పై సిద్దార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. వెంకటరమణ ఎస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 చెబుతోంది. అయితే దీనికి భిన్నంగా సమాజంలో పరిస్థితులు ఉన్నాయి. ఆర్టికల్ 20 స్ఫూర్తిని కాపాడుకోవాలని చెప్పే చిత్రమిది అన్నారు. మంచి సందేశంతో పాటు ఓ సరికొత్త ప్రేమకథను ఈ సినిమాలో చూపిస్తున్నాం అన్నారు. కాకినాడ, యానం పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. 50 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు నిర్మాత సిద్దార్థ. రామరాజు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మాటలు: సురేష్ కుమార్ వై, ఛాయాగ్రహణం : జి.అమర్.














