Skip to main content

Namaste NRI

విజయ్‌ దేవరకొండ జోడీగా… పూజాహోగ్డే

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జనగణ మన పేరుతో దేశభక్తి ప్రధాన చిత్రం తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఖారారు చేసినట్లు తెలిసింది. కథ నచ్చడంతో పాటు పాన్‌ ఇండియా సినిమా కావడంతో పూజాహెగ్డే వెంటనే అంగీకారం తెలిపిందని అంటున్నారు. విజయ్‌ దేవరకొండ సరసన ఆమెకిది తొలి చిత్రం కావడం విశేషం.  ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. 

Social Share Spread Message

Latest News