Skip to main content

Namaste NRI

మరో సినీజంట విడాకులు!

సినీరంగంలో తారల విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది.  తాజాగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌ తన భార్య సీమాఖాన్‌ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ 24 ఏళ్ళ వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఇరువురు తెలిపారు. ముంబై కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సోహైల్‌, సీమలది ప్రేమ వివాహం ఇంట్లో నుండి పారిపోయి 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్వాన్‌ ఖాన్‌ సంతానం. ఆ తర్వాత సరోగసి ద్వారా రెండో కుమారుడిగా జన్మనిచ్చారు. కొద్ది సంవత్సరాల క్రితమే వీరు విడిపోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వీటిని సీమ ఖండిరచింది.  ఆ తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నప్పటికీ కొంతకాలం ఇద్దరు విడి వివిడిగా ఉంటున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది. కుటుంబ న్యాయస్థానంలో సోహైల్‌, సీమా విడాకుల కోసం దరఖాస్తు చేశారు. అయితే దీనిపై ఈ జంట మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Social Share Spread Message

Latest News