Skip to main content

Namaste NRI

యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా ఇక లేరు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ సహ్యాన్‌ (73) కన్నుమూశారు. కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్న  ఆయన తుదిశ్వాస విడిచినట్టు అధ్యక్ష వ్యవహారాల శాఖ వెల్లడిరచింది. 40 రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. యూఏఈ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ పెద్ద కుమారుడైన ఖలీపా తండ్రి మరణానంతరం 2004లో దేశ పగ్గాలు చేపట్టారు. పుష్కలమైన చమురు, గ్యాస్‌ నిల్వల సాయంతో అభివృద్ధిని పరుగుల పెట్టించారు. ఆయన తండ్రి జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ 1971 నుంచి నవంబర్‌ 2, 2004 వరకు మరణించే వరకు యూఏఈ మొదటి అధ్యక్షుడిగా సేవలందించారు.  1948లో జన్మించిన షేక్‌ ఖలీఫా యూఏఈ రెండో అధ్యక్షుడిగా, అబుదాది ఎమిరేట్‌ 16వ పాలకుడు.

Social Share Spread Message

Latest News