Skip to main content

Namaste NRI

కమల్‌ హాసన్‌ విక్రమ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వలో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్‌. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.  విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇటీవల పతళ పతళ అంటూ సాగే పాటని విడుదల చేశారు. తమిళంలో ఆ పాటని కమల్‌ హాన్‌ స్వయంగా రచిండడంతో పాటు, ఆలపించారు. పాటలో కమల్‌హాసన్‌ నృత్యాలు  అలరించాయి. ఆయనే మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్‌ 3న పలు భాషల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిరుధ్‌ సంగీతమందించారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 15న విడుదల చేస్తారు.   కాళిదాస్‌, జయరామ్‌, నరైన్‌, అర్జున్‌దాస్‌, శివాని నారాయణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరిష్‌ గంగాధరన్‌,  నిర్మాతలు: కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

Social Share Spread Message

Latest News