పూర్తి వినోదాత్మక కథతో వస్తున్న ఎఫ్3 సినిమా థియేటర్లలో నవ్వుల హంగామా చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఎఫ్3లో మరింత గ్లామర్ జోడిరచారు. తమన్నా, మెహరీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తోంది. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా వచ్చిన లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాటలో పూజా హెగ్డే స్పెషల్ అప్పి యరెన్స్ ఇవ్వనుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ కలిసి సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతాన్ని అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి అలపించారు. ఈ పాటలో స్నేక్ డాన్స్ మాస్‌ని అలరిస్తాయని చిత్ర బృందం అంటోంది. సునీల్, వెన్నెల కిశోర్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణమ్మ, సోహల్ చౌహాన్ ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.














